కడెం, వెలుగు : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మేడంపల్లి సదర్మాట్ ఆనకట్ట నుంచి ఆయకట్టు చివరి పంటల వరకు సాగునీళ్లివ్వాలని కొత్త మద్దిపడగ,పాత మద్దిపడగ, లక్ష్మీ సాగర్ గ్రామాల రైతులు ధర్మాజీపేట వద్దనున్న మెయిన్‌రోడ్డుపై ఆందోళన చేశారు. వారు మాట్లాడుతూ ఇరిగేషన్ ఆఫీసర్ల సూచనల మేరకే తాము సదర్మాట్ ఆయకట్టులో పంటలు సాగు చేస్తున్నామన్నారు. ఇప్పుడు ధర్మాజీపేట్ వరకు మాత్రమే సాగునీటిని విడుదల చేసి తమ గ్రామాలకు విడుదల చేయడం లేదన్నారు.
ఓ పక్క పంటలు ఎండుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదన్నారు. వెంటనే సాగునీటిని విడుదల చేస్తామని హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని రైతులు స్పష్టం చేశారు. దీంతో అక్కడికి వచ్చిన కడెం ఎస్సై కొసన రాజు ఆందోళనకారులతో మాట్లాడారు. సంబంధిత ఇరిగేషన్ ఆఫీసర్డబ్బులు తీసుకొని వేరే గ్రామాల రైతులకు సాగునీటిని విడుదల చేస్తున్నారని, అతడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.