కోరుట్లలో రోడ్లపై రైతుల ధర్నా

జగిత్యాల జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. కొరుట్లలో ధాన్యం కొనుగోలు చేయటం లేదని రోడ్లపై నిరసన చేపట్టారు. వ్యవసాయ మార్కెట్ లో పడిగాపులు కాస్తున్న ధాన్యం కొనుగోళ్లు చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అకాల వర్షాలతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. నెల రోజులుగా ధాన్యం ఐకేపీ సెంటర్లలోనే నిలిచిపోయిందని వాపోయారు. 

పట్టించుకోని అధికారులు..

ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. ఇప్పటినుంచి అయినా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నదాతలు కోరారు. ధర్నా నిర్వహిస్తున్న రైతుల దగ్గరికి తహసీల్దార్ రాజేష్ వచ్చి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో.. రైతులు ఆందోళన విరమించుకున్నారు.