
నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ లో నూతనంగా నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలంటూ.. స్థానిక రైతులు నిరసన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని జాతీయ రహదారి దగ్గర బైఠాయించిన రైతులు.. వంటావార్పు నిర్వహించారు. అదేవిధంగా దిలావర్ పూర్ మండలంలో వ్యాపారస్తులు స్వచ్ఛంద బంద్ ను పాటించారు.
పర్యావరణ శాఖకు తప్పుడు దృవపత్రాలు సమర్పించి అనుమతులు పొందారంటూ ఆరోపించారు. ఫ్యాక్టరీ అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం ఆపే వరకు ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రద్దు చేయకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని రైతులు హెచ్చరించారు.