నెల్లికుదురు (కేసముద్రం), వెలుగు : దళితబంధు ఇవ్వకుంటే బీఆర్‌ఎస్ లీడర్లను ఊర్లోకి రానివ్వబోమంటూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి దళితులు హెచ్చరించారు. దళితబంధు, డబుల్ ఇల్లు, మూడు ఎకరాల భూమి ఇవ్వాలంటూ శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దళితబంధు బీఆర్‌ఎస్ లీడర్లకే ఇస్తరా.. కూలీ పనులు చేసుకునేటోళ్లకు ఇవ్వరా అంటూ ప్రశ్నించారు. తాము కూడా బీఆర్‌ఎస్‌కే ఓటు వేశామని, ఏ మీటింగ్ జరిగినా వెళ్తున్నామని, అయినా కొందరు లీడర్లు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిసేపటి తర్వాత రాస్తారోకో విరమించారు.