మహబూబ్‌నగర్ ఫొటోగ్రాఫర్ వెలుగు : రైతు పండుగ రెండో రోజు శుక్రవారం ఫుల్‌జోష్‌గా సాగింది. పాలమూరు జిల్లా నుంచే కాకుండా నల్లగొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సదస్సు ప్రాంగణం నిండిపోయింది. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, పశు సంవర్ధక శాఖ, ఇతర వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్నూ రైతులు సందర్శించారు.
వరిలో కొత్త వంగడాలు, వ్యవసాయ యంత్రాలు, పని ముట్లను పరిశీలించారు. సదస్సుకు వచ్చిన స్టూడెంట్స్‌కు నిర్వాహకులు స్టాల్స్‌లో ఉన్న ప్రదర్శనల గురించి వివరించారు. మధ్యాహ్నం 3గంటలకు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర్ రావు స్టాల్స్‌ను విజిట్ చేశారు.