కరెంట్‌ లేక పంటలు ఎండుతున్నయ్ : కల్నలచెర్వు  రైతులు

గరిడేపల్లి, వెలుగు: సరిపడా కరెంట్‌ రాకపోవడంతో వరి పైర్లు ఎండుతున్నాయని గరిడేపల్లి మండలం కల్నలచెర్వు  రైతులు వాపోయారు.  బుధవారం గ్రామంలోని విద్యుత్ సబ్‌ స్టేషన్‌ ముందు ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నా..  4 గంటలకు మించి రావడం లేదని మండిపడ్డారు.  ప్రస్తుతం వరి పంటం పొట్ట దశలో ఉందని, బోర్లకు సరిపడా కరెంట్ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.