కామారెడ్డి: గాంధారీ వాగులో చిక్కుకున్న ముగ్గురు రైతులు

కామారెడ్డి: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వరదలతో పలు గ్రామాలు నీట మునిగాయి.  చెరువులు, కుంటలు పొంగిపొర్లుతుండటంతో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. వరదల్లో రైతులు చిక్కుకుపోయారు.  

కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పేట్ సంఘంలో గాంధారీ వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహంలో ముగ్గురు రైతులు చిక్కుకుపోయారు. గౌరీ సంగయ్ అనే రైతులు తన వ్యవసాయ పొలం వద్ద వరదల్లో చిక్కుకుపోయాడు. మరోవైపు వ్యవసాయ పనులకోసం వెళ్లి వస్తున్న మరో ఇద్దరు రైతులు వాగు ప్రవాహంలో గల్లంతయ్యారు. రైతులకోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు, స్థానికులు. స్థానిక ఎమ్మెల్యే సురేందర్, కలెక్టర్ దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారు.