ఎండుతున్న పొలాలు.. జీవాలను మేపుతున్న రైతులు

ఎండుతున్న పొలాలు.. జీవాలను మేపుతున్న రైతులు

తుంగతుర్తి,  వెలుగు : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నూతనకల్, జాజిరెడ్డిగూడెం మండలాల్లోని పలు గ్రామాల్లో ఎస్సారెస్పీ జలాలు అందకపోవడంతో వరి పొలాలు ఎండిపోయాయి. దీంతో  పంట పొలాల్లోనే  జీవాలను మేపుతున్నారు. 

గతంలో వచ్చిన విధంగా ఎస్సారెస్పీ జలాలు రావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఎండిపోయిన వరి పంటకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.