సూర్యాపేట, వెలుగు : ప్రభుత్వం రుణమాఫీ చేసినా కెనరా బ్యాంక్ అధికారులు అమలు చేయడం లేదని రైతులు ఆరోపించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కెనరా బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని బ్యాంకులు రుణమాఫీ అమలు చేసి కొత్త రుణాలు ఇస్తుంటే
కెనరా బ్యాంక్ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇదేంటని ప్రశ్నిస్తే పైనుంచి డబ్బులు రాలేవని సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు.
ALSO READ: గద్వాలలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రారంభం: దీపక్ కుమార్