మెదక్‌టౌన్, వెలుగు: ప్రభుత్వం రైతులకు మొదటి విడత రుణమాఫీ ప్రకటించిన నేపథ్యంలో బ్యాంకుల వద్ద అన్నదాతల రద్దీ పెరిగింది. రుణమాఫీ జరిగిందా లేదా మళ్లీ క్రాప్‌లోన్ తీసుకోవచ్చా అంటూ వారికి కావాల్సిన వివరాలు తెలుసుకునేందుకు ఉదయం 7 గంటల నుంచే బ్యాంకుల వద్ద క్యూ కట్టారు. మెదక్లని ఏపీజీవీబీ బ్యాంకుకు సోమవారం రైతులు అధిక సంఖ్యలో వచ్చారు.
నాలుగో శనివారం, ఆదివారం వరుసగా బ్యాంకుకు సెలవులు రావడంతో సోమవారం తరలివచ్చారు. బ్యాంకు దగ్గర టోకెన్ల సిస్టమ్పెట్టడంతో ఉదయమే వచ్చి లైన్లలో నిల్చున్నారు. బ్యాంకు అధికారులు వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఓపిగ్గా సమాధానాలిచ్చి పంపించారు.