పత్తి తూకంలో మోసాలు.. రైతులు ఆందోళన

కరీంంనగర్ : రామడుగు మండల కేంద్రంలోని కావేరి జిన్నింగ్ మిల్లులో పత్తి తూకంలో మోసాలు జరుగుతున్నాయంటూ రైతులు ఆందోళన చేపట్టారు. వెలిచాల గ్రామానికి చెందిన కమలాకర్ అనే రైతు తీసుకొచ్చిన 14.4 క్వింటాళ్ల పత్తిలో 30 కిలోల దాకా తక్కువగా తూకం చూపించినట్లు గుర్తించారు. కావేరి జిన్నింగ్ మిల్లు వే బ్రిడ్జిపై  14.04 క్వింటాళ్లుగా చూపించిన రీడింగ్. మరో మిల్లులో 14.4 క్వింటాళ్లుగా నమోదైంది. రెండింటి మధ్య తేడా గమనించి నిర్వాహకులను రైతులు నిలదీశారు. ప్రతిరోజూ మిల్లుకు వచ్చే వందలాది క్వింటాళ్ల పత్తి క్రయ, విక్రయాల్లో ఇదే తరహాలో మోసాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.