ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ తో రైతులు భూములపై హక్కులు కోల్పోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. నిరుపేద దళితులకు మూడెకరాల చొప్పున భూమి ఇస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్..ఇప్పుడేమో ఉన్న భూమినే గుంజుకుంటున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన ఆందోళనలో సీఎల్పీ భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై భట్టి మండిపడ్డారు. ధరణి పోర్టల్ తీసుకొచ్చినప్పుడు జరిగిన పొరపాట్లను సవరించకపోతే సహించేది లేదన్నారు. అసైన్డ్, ఇనాం భూముల్లో ఏళ్ల తరబడి సాగు చేసుకుని జీవిస్తున్న అర్హులైన పేదలకు వెంటనే పట్టాలివ్వాని డిమాండ్ చేశారు. అలాగే నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.