రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు : రామారావు పటేల్

కుభీర్, వెలుగు: రైతులు దళారులను నమ్మి మోసపోవొద్దని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వ్యవసాయ మార్కెట్​లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ కోరారు. కుభీర్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్క్​ఫెడ్ ద్వారా చేపట్టనున్న కందుల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందన్నారు.

క్వింటాలు కందులకు ప్రభుత్వం ప్రస్తుతం రూ.9,535 మద్దతు ధర చెల్లిస్తోందని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. మార్క్​ఫెడ్ డైరెక్టర్ గంగా చరణ్, డీఎం ప్రవీణ్ కుమార్, బోయిడి విఠల్, వడ్నం నాగేశ్, నాగేందర్, కనకయ్య, సాయినాథ్, గులాబ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.