కూసుమంచిలో రైల్వే లైన్ సర్వేను అడ్డుకున్న రైతులు

కూసుమంచి, వెలుగు : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో రైల్వేలైన్​ మార్కింగ్​ కోసం శుక్రవారం సర్వే చేస్తున్న అధికారులను స్థానిక రైతులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు.  తమ భూముల్లో నుంచి రైల్వే లైన్​ వద్దంటూ మంత్రి పొంగులేటికి, ఎంపీ నామా నాగేశ్వరరావుకు వినతిపత్రాలు అందజేశారు. ఆందోళన చేపట్టినవారిలో రైతులు చింతలపూడి శ్రీనివాసరావు, బెల్లం రామారావు, చింతలపూడి రామారావు, బెల్లం జెగన్, గద్దల వెంకటేశ్వర్లు, ఇంటూరి వెంకటేశ్వర్లు, బెల్లం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.