ఇసుక రవాణాను అడ్డుకున్న రైతులు

నర్సింహులపేట, వెలుగు: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని జయపురం ఆకేరు వాగు వద్ద శుక్రవారం ఇసుక రవాణాను రైతులు అడ్డుకున్నారు. ట్రాక్టర్లు వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా కందకం తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల పడ్డ వానలకు ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో వ్యవసాయ భూమి కోతకు గురైందన్నారు.ఇసుక అక్రమ రవాణా, కొత్తగా నిర్మించిన చెక్ డ్యాం వల్ల ముగ్గురు రైతులకు చెందిన 2 ఎకరాల భూమి వరదలో కొట్టుకు పోయిందని వాపోయారు. ఇసుక తవ్వకాలు జరిపితే ఉన్న భూమి కూడా మిగలదన్నారు.