జగిత్యాల- కరీంనగర్ హైవేపై రైతుల ధర్నా

జగిత్యాల జిల్లాలోని జగిత్యాల- కరీంనగర్ హైవేపై కోడిమ్యాల మండల రైతులు  ధర్నా నిర్వహించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

జగిత్యాల -కరీంనగర్ హైవేపై దాదాపు 20 నిమిషాల పాటు అన్నదాతలు ఆందోళన చేశారు. దీంతో  రోడ్డుపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సమయంలో రైతులకు పోలీసులు నచ్చచెప్పి రోడ్డుపై నుంచి లేపడంతో ..వాహనాలు రాకపోకలు సాగించాయి.