లక్కారం చెరువులోకి నీటిని వదలాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

లక్కారం చెరువులోకి నీటిని వదలాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్, వెలుగు : పిలాయిపల్లి కాల్వ నుంచి లక్కారం గ్రామ చెరువులోకి నీటిని వదలాలని, అందుకు సంబంధించిన పనులు మొదలుపెట్టాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కారం గ్రామ రైతులు శనివారం హైదరాబాద్​లో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. 

వెంటనే ఎమ్మెల్యే స్పందించి అధికారులతో మాట్లాడి రైతుల సమస్యను పరిష్కరించాలని సూచించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, పాశం సంజయ్ బాబు, కొయ్యడ సైదులుగౌడ్, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, ఐలయ్య యాదవ్, కంచరకుంట్ల రాంరెడ్డి, రైతులు ఉన్నారు.