వడ్డు కొనుగోలు చేయాలని పెద్దపల్లి జిల్లాలో రైతు డిమాండ్

సుల్తానాబాద్, వెలుగు: కొనుగోలు సెంటర్లకు తీసుకొచ్చిన వడ్లను వెంటనే కొనాలని డిమాండ్​చేస్తూ రైతులు రోడ్డెక్కారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ శివారు సుగ్లాంపల్లిలోనీ పీఏసీఎస్​ సెంటర్​వద్ద  రైతులు ధర్నా చేశారు. దీంతో రాజీవ్​హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. రైతులు మాట్లాడుతూ  కొనుగోలు సెంటర్లకు వడ్లు తీసుకొచ్చి నెల అయిందని, అయినా కొనడం లేదని ఆరోపించారు. అకాల వర్షాలతో వడ్లు తడుస్తున్నాయని, వాటికి మాయిశ్చర్​ ​రావడం లేదని కొనుగోళ్లు నిలిపివేశారని రైతులు ఆందోళనకు దిగారు. వారికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్ మద్దతు తెలిపి రాస్తారోకోలో పాల్గొన్నారు. అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు భీష్మించారు.  అనంతరం డీఏవో ఆదిరెడ్డి సెంటర్ ను సందర్శించి, తడిసిన వడ్లను కొంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.