యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.. జన్నారంలో ఆందోళన

  • అధికారుల హామీతో విరమణ

జన్నారం, వెలుగు :  యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన రైతులు మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై రాస్తారోకో చేశారు. వారం రోజుల నుంచి యూరియా దొరకడం లేదని, దీంతో తాము వరి పంట నష్టపోయే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం సంబంధిత ఆఫీసర్ల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం తొందరగా యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

సుమారు గంట పాటు రాస్తారోకో చేయడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చివరకు అగ్రికల్చర్ ఆఫీసర్లు మంగళవారంలోగా యూరియాను అందిస్తామని హమీనివ్వడంతో రాస్తారోకో విరమించారు. రైతుల రాస్తారోకోకు కాంగ్రెస్ లీడర్లు మద్దతు పలికారు.