HRCని ఆశ్రయించిన కామారెడ్డి రైతులు

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తున్న రైతులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. తాజాగా HRCని ఆశ్రయించి.. తమ గోడును వెళ్లబోసుకున్నారు. రైతులకు అన్యాయం చేసిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్, తమపై విచక్షణ రహితంగా లాఠీలతో కొట్టిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ ను కోరారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా తాము నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు.

తమకు ఎలాంటి సమాచారం లేకుండానే మాస్టర్ ప్లాన్ లో భాగంగా తమ భూములను లాక్కోవడం సరైన పద్ధతా..? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ పని చేస్తున్నారని ఆరోపించారు. తమపై దాడికి కారణమైన జిల్లా కలెక్టర్, పోలీసులపై కఠిన చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తున్న రైతులు వేడుకున్నారు.