మాకు తెలంగాణ కరెంట్​ ఇవ్వండి..ట్రాన్స్ కో డీఈకి రైతుల వినతి

మాకు తెలంగాణ కరెంట్​ ఇవ్వండి..ట్రాన్స్ కో డీఈకి రైతుల వినతి

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం శివారున ఉన్న 200 ఎకరాల వ్యవసాయ భూములకు తెలంగాణ కరెంట్​ ఇవ్వాలని రైతులు కోరుతూ ఆదివారం ట్రాన్స్ కో డీఈ జీవన్​ కుమార్​కు వినతిపత్రం అందజేశారు. తెలంగాణలోనే భూములు ఉన్నప్పటికీ ఆంధ్రా కరెంట్​ఇస్తున్నారని, దీని వల్ల తెలంగాణ ఉచిత కరెంట్​ను కోల్పోతున్నామని రైతులు పోయారు.

తెలంగాణ వచ్చి పదేళ్లయినా తమను పట్టించుకోకపోవడం శోచనీయం అంటూ డీఈ ఆఫీసు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం సింగిల్​విండో చైర్మన్​ అబ్బినేని శ్రీనివాసరావు, రైతులు కొడాలి శ్రీనివాసన్, పరిమి శ్రీనివాసరావు, తాళ్లూరి చిట్టిబాబులు పాల్గొన్నారు.