
వ్యవసాయ పనులు పక్కన పెట్టి రైతులంతా కాసేపు సరదాగా క్రికెట్ ఆడారు. నిర్మల్‌జిల్లా భైంసా మండలం కథ్గామ్లోని తపోవన్ స్కూల్గ్రౌండ్ ఇందుకు వేదికైంది. 24 మంది రైతులు భారత్, లగాన్ జట్లుగా విడిపోయి తలపడ్డారు.
దోతులు, లుంగీలు కట్టుకుని బ్యాటింగ్ చేయడం, బాల్ కోసం పరుగెత్తడం, బౌలింగ్ చేయడం ఆకట్టుకుంది. నిత్యం పొలం పనుల్లో అలసిపోయే రైతులు.. ఇట్ల పొద్దంతా గ్రౌండ్‌లోనే గడిపి రిలాక్స్ అయ్యారు. వీళ్ల ఆట చూసేందుకు ఊరి జనం కూడా భారీగానే తరలివచ్చారు. చివరకు భారత్ జట్టు గెలవడంతో సర్పంచ్ రాజు సిల్వర్ ట్రోఫీ అందజేశారు. - భైంసా, వెలుగు