ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 63 అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ మార్చాలని కలెక్టర్ కు రైతుల వినతి

ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 63  అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ మార్చాలని జగిత్యాల జిల్లా రైతులు కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామా రైతులు ప్రజావాణిలో కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. 

గతంలో సర్వే చేసిన అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ భూములు ఉన్నాయని అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ మార్చారని తెలిపారు. భూమినే జీవనోపాధిగా చేసుకొని జీవిస్తున్న రైతులు రోడ్ న పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే,  ఛాపర్ ద్వారా నూతనంగా సర్వే చేసి హద్దులు పెడుతున్నారని ఆరోపించారు. భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని రైతులు కోరారు.