గ్రీన్​ఫీల్డ్ హైవే పనులను అడ్డుకున్న రైతులు

గ్రీన్​ఫీల్డ్ హైవే పనులను అడ్డుకున్న రైతులు
  • పంట నష్టపరిహారం ఇచ్చే వరకు చేయొద్దంటూ ఆందోళన

నెక్కొండ, వెలుగు:  పంట నష్టపరిహారం ఇచ్చేదాకా గ్రీన్​ఫీల్డ్​హైవే పనులను అడ్డుకుంటామని భూములు కోల్పోయిన రైతులు ఆందోళన చేపట్టారు. వరంగల్​జిల్లా నెక్కొండ మండలం తోపనపల్లిలో సోమవారం గ్రీన్ ఫీల్డ్​​హైవే పనుల్లో భాగంగా రైతులకు సమాచారం ఇవ్వకుండా సాగుచేసిన పంటలను  జేసీబీ, ప్రొక్లెయిన్ తో  ధ్వంసం చేస్తుండగా అడ్డుకున్నారు. 15 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలను కూడా చెడగొడుతుండగా ఆఫీసర్లకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది.

ఏసీపీ కిరణ్​కుమార్, సీఐ శ్రీనివాస్,​ఆర్​డీవో ఉమారాణి సిబ్బందితో వెళ్లి కాంట్రాక్టర్​తో పనులు చేయించారు. రెండు నెలలు సమయం ఇస్తే.. పంటలు చేతికి వస్తాయని రైతులు కోరినా వినలేదు. 15మంది రైతులు తహసీల్దార్​ ఆఫీసుకు వెళ్లి వినతిపత్రం ఇచ్చారు. ఆఫీసర్లు మాత్రం నష్టపరిహారం ఇస్తామని, పనులను అడ్డుకోవద్దని రైతులకు సూచించగా వెనుదిరిగారు.