సాగు భూములు సీఆర్​పీఎఫ్​కు ఇవ్వడాన్ని నిరసిస్తూ రైతుల ఆందోళన

సాగు భూములు సీఆర్​పీఎఫ్​కు ఇవ్వడాన్ని నిరసిస్తూ రైతుల ఆందోళన

బోర్డు పెట్టేందుకు వచ్చిన జవాన్లు, ప్రజలకు మధ్య వాగ్వాదం 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సాగు భూములను సీఆర్​పీఎఫ్​ బెటాలియన్​కు ఇవ్వడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజలు చేపట్టిన ఆందోళన శుక్రవారం ఉద్రిక్తతకు దారి తీసింది. చుంచుపల్లి మండలం రుద్రంపూర్​ప్రాంతంలోని లక్ష్మీపురం, త్రీ ఇంక్లైన్​, ఫోర్​ఇంక్లైన్​ ప్రాంతాలకు అనుకొని ఉన్న భూములను దాదాపు 40–50 ఏండ్లుగా ఆ ప్రాంత రైతులు సాగు చేసుకుంటూ బతుకుతున్నారు. 

అయితే, ఎటువంటి ప్రజాభిప్రాయం తీసుకోకుండానే దాదాపు 70 ఎకరాల భూమిని అధికారులు సీఆర్​పీఎఫ్​ బెటాలియన్​కు అప్పగించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భూముల్లో శుక్రవారం సీఆర్​పీఎఫ్​ బెటాలియన్​సిబ్బంది బోర్డులు ఏర్పాటు చేస్తుండగా అడ్డుకున్నారు. ఈ క్రమలో ఇరు వర్గాల మధ్య వాగ్వావాదం నెలకొంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ భూములిచ్చేది లేదని పట్టుబట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో వారి సమక్షంలో బెటాలియన్​ సిబ్బంది బోర్డులు పాతారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎమ్మెల్యేతో పాటు రాజకీయ పార్టీల నేతలు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.