
- కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్
మెదక్ (చేగుంట), వెలుగు: కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూర్ రైతులు మంగళవారం రాస్తారోకో చేశారు. చేగుంట–గజ్వేల్ మెయిన్ రోడ్డుపై కర్నాల్ పల్లి వద్ద వాహనాలు వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంపలు వేశారు. వరి పొలాలు పొట్ట దశలో నీటి తడులు అందక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వరి పొలాలను కాపాడాలని కోరారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. రైతుల రాస్తారోకోతో గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది.