పొలం పొతే బిచ్చమెత్తుకుని బతకాల్నా : రైతులు

కామారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా కొనసాగుతోంది. కలెక్టర్ స్పందించే వరకు ధర్నా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాత్రి కూడా ధర్నా కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. సమస్య పరిష్కరించే వరకు అక్కడి నుంచి కదిలేదిలేదని బీష్మించుకున్నారు. కలెక్టర్ బయటకు వచ్చేందుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

మూడు పంటలు పండే పొలాల్లో ఇండస్ట్రీలు పెడతారా అని రైతులు ప్రశ్నించారు. పొలం పొతే బిచ్చమెత్తుకుని బతకాలా అని నిలదీశారు. రాజకీయ నేతలను వదిలిపెట్టి పేదల భూములను గుంజుకుంటున్న ప్రభుత్వ తీరు దుర్మార్గమని మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న రైతులు కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులకు వారిని అడ్డుకున్నారు. తోపులాటలో సంతోష్ అనే రైతు కాలు విరిగిపోగా.. ఓ మహిళకు గాయాలయ్యాయి.