24 గంటలన్నరు..10 గంటలు కూడా ఇస్తలేరు: రైతులు

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో రైతులు ధర్నాకు దిగారు. 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెబుతున్న  ప్రభుత్వం 10 గంటలు కూడా ఇవ్వడం లేదంటూ ఇటిక్యాల సబ్ స్టేషన్ ముందు బైఠాయించారు.   ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కోతలులేకుండా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.  రాత్రిపూట కరెంట్ ఇస్తే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ మేరకు రైతులు ఒడ్డే లింగాపూర్ ట్రాన్స్ కో  ఏఈకి వినతి పత్రం అందజేశారు. రైతుల ధర్నాతో కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.