ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

హాలియా, వెలుగు : వడ్లను త్వరగా కొనుగోలు చేయాలని కోరుతూ నల్గొండ జిల్లా పెద్దవూరలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైవేపై సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. వీరికి బీజేపీ లీడర్లు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రైతులతో పాటు, బీజేపీ మండల అధ్యక్షుడు ఏరుకొండ నరసింహ మాట్లాడుతూ వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పెద్దవూర మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వడ్లు తీసుకొచ్చి 20 నుంచి 25 రోజులు గడుస్తున్నా ఒక్క ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు కన్నెత్తి చూడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా విషయం తెలుసుకున్న కోఆపరేటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుంటుక వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, పెద్దవూర ఎస్సై పరమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైతులతో మాట్లాడారు. మంగళవారం ఉదయం అగ్రికల్చర్ ఏవోని పంపించి వడ్ల కాంటాలు పెడుతామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. కార్యక్రమంలో నాయకులు జానపాటి నాగయ్య, ఏరుకొండ పద్మ, వడ్డేపల్లి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, కంచర్ల వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, కంచర్ల లక్ష్మమ్మ,  రేణుక, కందుల వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, వటపల్లి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, భాగ్యమ్మ, సుమలత, పద్మ, తరి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

కోదాడను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

కోదాడ, వెలుగు : సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. పట్టణ పరిధిలోని పలు వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. అలాగే బాలాజీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వైకుంఠధామం ప్రారంభం, అనంతగిరి, దోరకుంటలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం కోదాడ పట్టణంలోని బాయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైస్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మన ఊరు మన బడి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో కోదాడ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎంఈవో సలీం షరీఫ్, కౌన్సిలర్లు కట్టెబోయిన జ్యోతి, గుండెల సూర్యనారాయణ, కోట మధు పాల్గొన్నారు.

దొంగ దీక్షలు మానుకోవాలి

చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి దొంగ దీక్షలు మానుకోవాలని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలోని 7,600 మంది గొల్ల కురుమల అకౌంట్లలో డబ్బులు పడ్డాయని చెప్పారు. లబ్ధిదారులకు డబ్బులు అందకుండా చేసిన వారే మళ్లీ ఇప్పుడు ధర్నాలు చేయడం సరికాదన్నారు. మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగీరథ ద్వారా మునుగోడు నియోజకవర్గానికి మంచి నీటిని తీసుకొచ్చి ఫ్లోరోసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దూరం చేసినట్లు చెప్పారు. సమావేశంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన అయోధ్యయాదవ్, ట్రెజరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిన్నం బాలరాజు యాదవ్, చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టణ కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాగరాజు, నాయకులు నల్ల గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

గ్రంథాలయాల అభివృద్ధికి కృషి

సూర్యాపేట, వెలుగు : గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. సూర్యాపేటలో సోమవారం గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిమ్మల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, కౌన్సిలర్ నిమ్మల స్రవంతి, సుధాకర్ పీవీసీ సంస్థల అధినేత మీలా మహదేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యానాల యాదగిరిరెడ్డి పాల్గొన్నారు.

యాదాద్రిలో పోడు సర్వే 

  •     10 గ్రామాల్లో 2,130 అప్లికేషన్లు
  •     20 టీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసిన ఆఫీసర్లు

యాదాద్రి, వెలుగు : పోడు భూముల సమస్యను కొలిక్కి తెచ్చేందుకు సర్కారు చర్యలు ప్రారంభించింది. పోడు సాగు చేస్తున్న గిరిజన, గిరిజనేతర రైతులకు హక్కు పత్రాలు జారీ చేసేందుకు ఆఫీసర్లు సర్వే స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. హక్కుల పత్రాలు ఇచ్చేందుకు గతేడాది నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే అప్లికేషన్లు తీసుకున్నారు. యాదాద్రి జిల్లాలోని సంస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నారాయణపురం, చౌటుప్పల్, తుర్కపల్లి మండలాల్లోని పది గ్రామాల్లో 2,130 మంది గిరిజన, గిరిజనేతరులు మొత్తం 6,133 ఎకరాల కోసం అప్లై చేసుకున్నారు. పోడు భూములపై అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదటివారంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రివ్యూలు జరిగాయి. కానీ అదే టైంలో మనుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావడంతో యాదాద్రి జిల్లాలో ఎలాంటి మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిర్వహించలేదు.

20 టీంలతో సర్వే

మునుగోడు ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ నెల 8తో ముగియడంతో పోడు భూములపై రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిర్వహించారు. అనంతరం అటవీ, సర్వేయర్, పంచాయతీ ఆఫీసర్లతో సర్వే టీంలను ఏర్పాటు చేశారు. 10 గ్రామాల్లో సర్వే చేసేందుకు మొత్తం 20 టీంలను నియమించారు. ఈ టీంలు గ్రామాల వారీగా అప్లై చేసుకున్న రైతుల ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తీసుకుంటున్నారు. 2005 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 13 నాటికి సర్వే నంబర్ల వారీగా ఎంత మేరకు పోడు సాగు చేస్తున్నారు ? విస్తీర్ణం ఎంత ? నాలుగు వైపులా ఎవరెవరు రైతులు ఉన్నారన్న వివరాలు తెలుసుకుంటున్నారు. గత వారం రోజులుగా సుమారు 200 అప్లికేషన్లను పరిశీలించి, 170 ఎకరాలకు పైగా సర్వే చేశారు. సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశాల ప్రకారం ఈ నెల 20 లోపు సర్వే కంప్లీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి.

20 లోపు కంప్లీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యేనా ?

అప్లికేషన్ల సంఖ్య, సర్వే చేయాల్సిన భూమిని చూస్తే ఈ నెల 20 నాటికి సర్వే కంప్లీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 6 వేల ఎకరాలకు పైగా భూమిని సర్వే చేయడం, ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్​లోడ్​ చేయడంతో పాటు గ్రామాలు, డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీలతో తీర్మానం చేయాలి. ఇన్ని పనులు ఇంత తక్కువ కాలంలో పూర్తి చేయడం అసాధ్యం అని పలువురు అంటున్నారు. 

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి

యాదాద్రి, వెలుగు : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరగా  పరిష్కరించాలని యాదాద్రి అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తివారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రజావాణికి ఆయన హాజరై ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. మొత్తం 32 ఫిర్యాదులు రాగా, ఇందులో 26 రెవెన్యూ, 2 పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 2 గ్రామీణాభివృద్ధి, విద్య, పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖలకు సంబంధించినవి ఒక్కొక్కటి ఉన్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయకుమారి, ఏవో ఎం.నాగేశ్వరాచారి, డీపీవో సునంద ఉన్నారు. కాగా యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వెల్వర్తి సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నామేరీని సస్పెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమలు చేయాలని వార్డు సభ్యులు అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలువగా ఆయన డీపీవో సునంద వద్దకు పంపించారు. వార్డు సభ్యులు డీపీవోను కలిసి సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సస్పెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని కోరగా కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేస్తామని డీపీవో బదులిచ్చారు. దీంతో వార్డు సభ్యులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని బయటకు పంపించారు. 

ఫిర్యాదులను పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టొద్దు

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : ప్రజావాణి ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని నల్గొండ అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటిని సంబంధిత ఆఫీసర్లకు పంపించారు.

పాడి రైతులకు ప్రోత్సాహక నిధులను విడుదల చేయాలి

బాలల రక్షణకు కృషి చేయాలి

సూర్యాపేట, వెలుగు : బాలల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృ-షి చేయాలని సూర్యాపేట జిల్లా వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ జ్యోతి పద్మ సూచించారు. మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి రవికుమార్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షతన సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పిల్లల సంరక్షణ కోసం ప్రభుత్వం అనేక చట్టాలను రూపొందించిందన్నారు. అనంతరం పలు పోటీలు నిర్వహించిన గెలిచిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో సీపీడీవో విజయ్‌‌‌‌‌‌‌‌ చంద్రిక, జేజేబీ మెంబర్‌‌‌‌‌‌‌‌ రామ్మోహన్‌‌‌‌‌‌‌‌రావు, సీడీపీవో విజయలక్ష్మి, లేబర్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ మంజుల పాల్గొన్నారు. 

ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు విఫలం

యాదగిరిగుట్ట, వెలుగు : నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఏఐవైఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర ఆరోపించారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో సోమవారం నిర్వహించిన ఏఐవైఎఫ్ జిల్లా కౌన్సిల్ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. బీజేపీ, టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల దేశం, రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించనున్న ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎల్లంకి మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జిల్లా కార్యదర్శి పేరబోయిన మహేందర్, జిల్లా ఆఫీస్ బేరర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొండూరి వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎండీ నయీం, బద్దుల శ్రీను పాల్గొన్నారు.

పండిన ప్రతి గింజను కొంటాం

హాలియా/దేవరకొండ, వెలుగు : రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందని ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. నల్గొండ జిల్లా అనుముల మండలం, వీర్లగడ్డ తండా, చింతగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను కోటిరెడ్డి, నేరేడుగొమ్ము మండలం పేర్వాలలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రవీంద్రకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇరిగి పెద్దులు, ఎంపీపీ సుమతి పురుషోత్తం, వంగాల ప్రతాప్​రెడ్డి, శిరందాసు లక్ష్మమ్మ కృష్ణయ్య, ఎలుగూరి వల్లపురెడ్డి పాల్గొన్నారు.

స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆర్థికసాయం

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీటు సాధించినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరమయ్యే పరిస్థితిలో ఉన్న ఓ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అండగా నిలిచారు. నల్గొండలోని ఓల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీ మాధవనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఊట్కూరి రుక్కయ్య కుమార్తె శ్రీలక్ష్మి ఇటీవల ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీటు సాధించింది. అయితే వారి ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో విషయం తెలుసుకున్న కోమటిరెడ్డి స్పందించి శ్రీలక్ష్మి చదువుకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా సోమవారం ఆర్థికసాయం అందజేశారు. 

రైతుల సమస్యలు పరిష్కరించాలి

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని బీజేపీ కిసాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోర్చా జాతీయ కార్యదర్శి గోలి మధుసూదన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. నల్గొండ సమీపంలోని ఆర్జాలబావి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. కేంద్రాల్లో వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల కోసం కేంద్రం ఇస్తున్న సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపిచారు. వీరెళ్లి చంద్రశేఖర్, దాసోజు యాదగిరాచారి, గుండా నవీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, బీపంగి జగ్జీవన్, పోతెపాక నవీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎన్నమల్ల అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

మినీ శిల్పారామం పనులు పూర్తి చేయండి

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగంగా రాయగిరి చెరువు కట్టను ఆనుకుని ఏర్పాటు చేస్తున్న మినీ శిల్పారామం పనులను త్వరగా పూర్తి చేయాలని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ (వైటీడీఏ) చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింగయ్య ఆదేశించారు. శిల్పారామంలో జరుగుతున్న పనులను సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఆధ్యాత్మిక, ఆహ్లాదకరమైన వాతావరణం ఉట్టిపడేలా శిల్పారామాన్ని తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. కొలనులోకి దిగడానికి నిర్మించే మెట్లు, గేటు పనులను ఫాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చేయాలని సూచించారు. ఆయన వెంట ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ ఈఈ వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, డీఈ మణిబాబు, డిప్యూటీ స్థపతి మోతీలాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థపతి హేమాద్రి పాల్గొన్నారు.

మిల్లుల కాలుష్యాన్ని నియంత్రించాలి

కోదాడ, వెలుగు : మిల్లుల నుంచి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని తమ్మర గ్రామస్తులు సోమవారం కోదాడ – ఖమ్మం రోడ్డుపై ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ మిల్లుల నుంచి వచ్చే బూడిద, వ్యర్థాల వల్ల శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని పలుమార్లు ఆఫీసర్లకు కలిసినా ప్రయోజనం లేదని ఆరోపించారు. స్థానికుల ధర్నాతో సుమారు రెండు కిలోమీటర్ల మీర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో విషయం తెలుసుకున్న అనంతగిరి ఎస్సై సత్యనారాయణ ఘటనాస్థలానికి వచ్చి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.