కొనుగోలు కేంద్రం ఎత్తివేతపై రైతుల ఆగ్రహం

  • కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని గొల్లపల్లిలో రైతుల ఆందోళన

మంచిర్యాల జిల్లా:  గొల్లపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతులు ఆందోళన చేశారు. ఆరేళ్లుగా గ్రామంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని ఈ సారి ఎత్తివేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  గ్రామంలో ఉన్న ఐకేపీ సెంటర్ ఎత్తివేయడంతో దళారుల చేతిలో మోస పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక్క గొల్లపల్లి గ్రామంలోని రైతులు దాదాపు 60 లారీల ధాన్యం పండించడం జరుగుతోంది. ఇంత ధాన్యాన్ని..ఇంతమంది రైతులు ఇబ్బందిపడుతూ ఇతర ప్రాంతాలకు ఎలా తీసుకెళ్లాలని గ్రామస్తులు ప్రశ్నించారు. అధికారులు తమపై కక్ష కట్టినట్లు ఎందుకువ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. వెంటనే తమ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని పునః ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు.