ట్రిపుల్ఆర్​కు భూములు ఇవ్వం

  • ఆర్డీవో ఆఫీసు ఎదుట రైతుల ఆందోళన

యాదాద్రి, వెలుగు : ట్రిపుల్​ఆర్​కు భూములు ఇవ్వమని భువనగిరి మండల రైతులు స్పష్టం చేశారు. భూ సేకరణ కోసం సోమవారం భువనగిరి ఆర్డీవో ఆఫీసులో పరిహారం చెల్లింపుపై సమావేశం ఏర్పాటు చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా ముందుస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

అయితే ఆర్డీవో ఆఫీసుకు వచ్చిన ఎర్రంబెల్లి, రాయగిరి, పెంచికల పహాడ్​ గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన నిర్వహించారు. ట్రిపుల్​ఆర్ అలైన్​మెంట్​మార్చాలని డిమాండ్​చేశారు. అనంతరం ఆర్డీవో కృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.