నర్సంపేటలో నకిలీ సీడ్స్‌‌‌‌ అమ్ముతున్నారని ధర్నా

నర్సంపేట, వెలుగు : నకిలీ సీడ్స్‌‌‌‌ అమ్ముతున్నారంటూ వరంగల్‌‌‌‌ జిల్లా నర్సంపేట పట్టణంలోని రెండు షాపుల ఎదుట బుధవారం రైతులు ఆందోళనకు దిగారు. వరంగల్‌‌‌‌ జిల్లా నర్సంపేట మండలం ద్వారకపేట, చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్‌‌‌‌కు చెందిన రైతులు సుమారు 800 ఎకరాల్లో మంగళ 1224 రకం వరి సాగు చేశారు. మూడు నెలలు గడిచినా గొలుసులు అరకొరగా రావడం, వచ్చినవి సైతం రాలిపోయాయి.

దీంతో బుధవారం రైతులు నర్సంపేటకు వచ్చి కిసాన్, బాలాజీ సీడ్స్‌‌‌‌ షాపుల ఎదుట ఆందోళనకు దిగి, వాటిని క్లోజ్‌‌‌‌ చేశారు. నకిలీ విత్తనాల కారణంగా ఎకరాకు రూ. 20 వేలు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఏవో కృష్ణప్రసాద్‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. మంగళ 1224 విత్తనాలను ల్యాబ్‌‌‌‌కు పంపించి కారణం తెలుసుకుంటామని ఏవో చెప్పారు. కస్ప రాజు, బాలసాయి, తంబి నరేందర్, దాసయ్య, అమర్‌‌‌‌, రవి ఉన్నారు.