
జనగామ, వెలుగు : పంట పొలాలకు దేవాదుల నీళ్లందించాలని డిమాండ్చేస్తూ రైతులు రోడ్డెక్కారు. జనగామ మండలం గానుగుపహాడ్లో హుస్నాబాద్రోడ్డుపై రైతులు పురుగుల మందు డబ్బాలు, ఎండిపోయిన వరి కంకులతో గురువారం నిరసన చేపట్టారు. పంటలు ఎండిపోతున్నాయని వెంటనే బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని, లేదంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న జనగామ టౌన్ సీఐ దామోదర్ రెడ్డి, ఎస్సై రాజేశ్ ఘటనా స్థలానికి చేరుకుని ఇరిగేషన్అధికారులతో మాట్లాడారు. రెండు, మూడు రోజుల్లో గ్రామానికి నీళ్లు వస్తాయని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.