సబ్స్టేషన్ ను ముట్టడించిన రైతులు..ఉద్రిక్తత

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం కడపర్తిలో రైతులు సబ్ స్టేషన్ ను ముట్టడించారు.  24 గంటల నిరంతర విద్యుత్  అని చెబుతున్న ప్రభుత్వం  రెండు గంటలు కూడా ఇవ్వడం  లేదంటూ  సబ్ స్టేషన్  ముందు  నిరసనకు దిగారు.  సబ్ స్టేషన్ లో రెండు గంటల పాటు  విద్యుత్ ను నిలిపివేశారు. దీంతో నాలుగు గ్రామాలకు విద్యుత్ నిలిచిపోయింది. అయితే పోలీసులు భారీగా చేరుకుని రైతుల నిరసనను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో కాసేపు పోలీసులుకు,  రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.