ఎల్లారెడ్డిపేటలో రైతుల ధర్నా

ఎల్లారెడ్డిపేటలో రైతుల ధర్నా

ఎల్లారెడ్డిపేట,వెలుగు :  కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన రైతులు ఆదివారం ఆందోళనకు దిగారు. సిరిసిల్ల–కామారెడ్డి రోడ్డుపై వడ్లు ఆరబోసి బైఠాయించారు. సుమారు గంటపాటు ధర్నా చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. రైతులకు బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లు మద్దతు తెలిపారు.

సమాచారం అందుకున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా , అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వడ్ల కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని నిర్వాహకులను ఆదేశించారు