
శంకరపట్నం, వెలుగు: పంటలకు సాగునీరు విడుదల చేయాలని కరీంనగర్ జిల్లాలో శంకరపట్నం మండలం కేశవపట్నం జాతీయ రహదారిపై రైతులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్‌ఎండీ నుంచి పంటలకు ఎస్సారెస్పీ సాగునీటి విడుదలను నిలిపివేయడంతో పొట్టదశలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయన్నారు. పంటలు చివరి దశలో ఉన్నందున ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో వరంగల్– కరీంనగర్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.