భూసర్వే రద్దు చేయాలని రైతుల నిరసన

జగిత్యాల టౌన్/రూరల్, వెలుగు: హైవే 63 కోసం చేస్తున్న భూ సర్వేను రద్దు చేయాలని సోమవారం జగిత్యాలలోని తహసీల్ చౌరస్తాలో రైతులు నిరసనకు దిగారు. భూసేకరణలో భూములు కోల్పోతున్న హన్మాజిపేట, తిప్పన్నపేట, కండ్లపల్లి, చర్లపల్లి, తాటిపల్లి, చల్గల్ గ్రామాలకు చెందిన రైతులు నిరసనలో పాల్గొన్నారు.

భూములు తీసుకుంటే  తాము ఉపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ లో వినతిపత్రం అందజేశారు.