బాల్క సుమన్కు నిరసన సెగ.. అడ్డుకున్న రైతులు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్కు నిరసన సెగ తగిలింది.  ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఆయన పర్యటించారు.  మహంకాళివాడ 11వ వార్డులో బాల్క సుమన్ ప్రచారం నిర్వహిస్తుండగా..కాళేశ్వరం బ్యాంక్ వాటర్ బాధిత రైతులు ఆయన్ను అడ్డుకున్నారు.  

బ్యాక్ వాటర్ తో తమ పంట పొలాలు నీట మునిగి తాము అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పరిష్కారం చూపక పోగ ఓట్ల కోసం ఎలా వస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో   పోలీసులు కల్పించుకొని వారిని సముదాయించారు. అటు బాల్క సుమన్ కూడా రైతులకు ఎలాంటి సమాధానం చెప్పుకోలేక వెనుదిరిగారు.  

ALSO READ :- గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తా : గడ్డం వినోద్​