కాటన్ మిల్ వద్ద రైతుల ఆందోళన .. చెన్నూర్ ఎమ్మెల్యే హామీతో విరమణ

కాటన్ మిల్ వద్ద రైతుల  ఆందోళన .. చెన్నూర్ ఎమ్మెల్యే హామీతో విరమణ

చెన్నూర్, వెలుగు: చెన్నూర్ లోని కాటన్ మిల్ వద్ద రైతులు ఆందోళన చేశారు. . స్థానిక వరలక్ష్మి కాటన్ మిల్ లో పత్తి కి గిట్టుబాటు ధర చెల్లించడం లేదని పత్తి లోడ్ తో ఉన్న వాహనాలను రోడ్ కు అడ్డంగా పెట్టి రోడ్ పై బైఠాయించి  నిరసన వ్యక్తం చేశారు. దీనితో రాకపోకలు నిలిచి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. 

రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి జిల్లా ఉన్నతాధికారులతో  మాట్లాడి సమస్యను పరిష్కరించినట్లు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.