మంచిర్యాల, వెలుగు: నేషనల్ హైవే 63 బాధిత రైతులు సోమవారం మంచిర్యాలలోని ఎన్ హెచ్ఏఐ పీడీ ఆఫీస్ఎదుట ధర్నా చేశారు. హైవే కోసం తమ భూములు లాక్కొని అన్యాయం చేయవద్దని కోరుతూ పీడీకి మెమోరాండం అందజేశారు. బీజేపీ సీనియర్ లీడర్తుల మధుసూదన్‌రావు మాట్లాడుతూ.. ఎన్హెచ్ఏఐ అధికారులు రియల్టర్లకు లబ్ధి చేసేందుకు మూడుసార్లు అలైన్మెంట్ మార్చారని ఆరోపించారు. ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద భూముల కోల్పోయిన రైతుల దగ్గర మరోసారి భూములు తీసుకొంటే వారు రోడ్డున పడతారని అన్నారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు.
పాత నోటిఫికేషన్ ద్వారా బ్రౌన్ ఫీల్డ్ లో ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా, భూసేకరణ లేకుండా హైవేను విస్తరించాలని డిమాండ్‌చేశారు. రైతు నాయకులు లెగిశెట్టి రాజమౌళి, జనార్దన్ రెడ్డి, పెట్టం తిరుపతి, తిప్పని మల్లేశ్, గొల్ల తిరుపతి, మంచి గట్ల మల్లేశ్, ఎమ్మార్పీఎస్ నాయకులు ఎస్ఆర్ బోస్, బీసీ ఐక్యవేదిక నాయకులు, స్వచ్ఛంద పౌర సేవా సంస్థ అధ్యక్షుడు మల్లయ్య పాల్గొన్నారు.