కోటగిరి, వెలుగు : నాసిరకం సీడ్స్ విక్రయించారని ఆరోపిస్తూ రైతులు శుక్రవారం కోటగిరి గ్రోమోర్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. గంగా కావేరి వరి సీడ్ అని చెప్పి నాసిరకం విత్తనాలను అందజేశారన్నారు. మిగతా రైతుల పొలాలు మరో 15 రోజుల్లో కోతకు వస్తున్నాయని
తాము వేసిన పంట మాత్రం ఇంకా పొట్ట దశ కూడా దాటలేదని వాపోయారు. నాసిరకం సీడ్స్ఇచ్చిన గ్రోమోర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్ కు ఫిర్యాదు చేశారు. యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేస్తానని ఏవో చెప్పడంతో శాంతించారు.