వరంగల్ సిటీ, వెలుగు : పత్తిని కొనుగోలు చేయాలని వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. రెండు రోజుల తర్వాత తెల్లవారుజామునే రైతులు మార్కెట్ కు రాగా కొనుగోలుదారులు ఎవరూ రాకపోవడంతో అమ్మకాలు నిలిచిపోయాయి. పత్తి రైతులు ఆందోళనతో పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే వరకు తాము ఏమి చేయలేమని అధికారులు తేల్చి చెప్పారు.
జిన్నింగ్మిల్లులు బంద్ చేయడంతో సీసీఐ కొనుగోలును నిలిపివేసిందని తెలిపారు. మార్కెట్ అధికారులు ముందస్తూ సమాచారం ఇవ్వకపోవడంతో మార్కెట్ కు పత్తి రైతులు వచ్చారు. అనంతరం రాష్ట్రస్థాయి చాంబర్ ఆఫ్ కామర్స్, జిన్నింగ్, ప్రెస్సింగ్ అసోసియేషన్ సూచన మేరకు కొనుగోలు చేస్తున్నట్టు వరంగల్చాంబర్ ఆఫ్కామర్స్ ప్రకటించింది. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు వ్యాపారులు కొనుగోలును ప్రారంభించారు.