
దుబ్బాక, వెలుగు: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల చౌరస్తాలో శుక్రవారం రైతులు కరెంట్ కోసం రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు రైతులు మాట్లాడుతూ.. 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తేనే వరి పంట చేతికొస్తుందన్నారు.
రోజులో కనీసం 10 గంటలు కూడా త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వడంలేదని ఆరోపించారు. ఫలితంగా చేతికొస్తున్న పంట ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మద్దెల రాజేశం మద్దతు తెలిపారు.