
తిమ్మాపూర్, జగిత్యాల రూరల్, వెలుగు : యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ ప్యాక్స్‌కు సోమవారం ఉదయం యూరియా లోడ్ రాగా రైతులు క్యూ కట్టారు. చాలాసేపు నిలబడడంతో ఓపిక లేకపోవడంతో చెప్పులను వరుసలో ఉంచారు.
కొందరికే యూరియా దొరకగా మిగతా వారు నిరాశగా వెనుదిరిగారు. అలాగే జగిత్యాల జిల్లాకేంద్రంలోని సహకార సంఘం ఎదుట రైతులు బారులుదీరారు. ఎండ తీవ్రత పెరగడంతో పాస్‌పుస్తకాలు, ఆధార్ కార్డులు లైన్‌లో ఉంచారు.