కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు పంజాబ్, చండీగఢ్ హర్యానా ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర మరియు కర్ణాటక ప్రాంతాలలో రైలు పట్టాలపై రైలు రోకో జరిగింది. ఈ రోజు ( మార్చి 10) మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ ఆందోళన సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. రైతుల రైల్ రోకో నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో రైలు సర్వీసులు నిలిపివేశారు.
పంజాబ్‌లోని దేవిదాస్‌పురాలోని చండీగఢ్‌లో రైతులు రైలు పట్టాలపై కూర్చొని నినాదాలు చేశారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని రైతులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అమృత్‌సర్‌లోని రైల్వే ట్రాక్‌పైకి మంచాలు, కార్పెట్లు, ఇతర సామాగ్రిని రైతులు రైల్వే ట్రాక్‌పైకి వచ్చారు.రైల్వే ట్రాకులపై పోలీసులు భారీగా మోహరించారు.ఎంఎస్‌పి గ్యారెంటీ యాక్ట్‌తో సహా పలు డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న రైతులు 'చక్కా జామ్' ప్రకటన కింద అమృత్‌సర్-ఢిల్లీ రైల్వే లైన్‌పై బైఠాయించారు. రైతుల రైల్ రోకో ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.
VIDEO | Farmers begin their 'rail roko' protest. Visuals from Chandigarh.
— Press Trust of India (@PTI_News) March 10, 2024
Earlier, the farmers had said that they would hold the 'rail roko' protest from 12 pm to 4 pm on March 10.
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/uS6tow6v9d
రైల్వే ట్రాక్‌పై కూర్చున్న రైతులు
దేవిదాస్‌పురాలోని అమృత్‌సర్-ఢిల్లీ రైల్వే లైన్‌తో సహా పంజాబ్‌లోని 22 జిల్లాల్లోని ప్రధాన రైల్వే లైన్లను 4 గంటల పాటు అడ్డుకున్నామని సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు చండీగఢ్, దేవిదాస్‌పురాలోని రైల్వే ట్రాక్‌లపై రైతులు కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ALSO READ :- Allu Arjun: వైజాగ్లో పుష్పరాజ్ మాస్ ఎంట్రీ.. భారీగా వచ్చిన అభిమానులు
రైతు నాయకుడు సర్వన్‌సింగ్ పంధేర్ మాట్లాడుతూ.. మా డిమాండ్‌లు సాధించే వరకు తమ నిరసనను కొనసాగిస్తామన్నారు. రైతు సంఘాలు ఈరోజు ( మార్చి 10) మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైల్ రోకోను నిర్వహించారని పంజాబ్‌లోని దేవిదాస్‌పురాలోని డీఎస్పీ రూరల్ ఇందర్‌జిత్ సింగ్ తెలిపారు.
ఫిబ్రవరి 13న పంజాబ్-హర్యానా సరిహద్దులో ప్రారంభమైన ఉద్యమంలో భాగంగా ఈరోజు( మార్చి 10) దేశవ్యాప్తంగా 'రైల్ రోకో'కి పిలుపునిచ్చామని పంజాబ్ మజ్దూర్ సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శి, రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. ఫిరోజ్‌పూర్, అమృత్‌సర్, రూప్‌నగర్, గురుదాస్‌పూర్ జిల్లాలతో సహా పంజాబ్‌లోని పలు చోట్ల రైతులు రైలు పట్టాలపై కూర్చొని నిరసన తెలిపారని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహన్), భారతీ కిసాన్ యూనియన్ (డకౌండ-ధనేర్) క్రాంతికారి కిసాన్ యూనియన్ 'రైల్ రోకో' ఉద్యమంలో పాల్గొన్నాయి.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ కోసం ఒత్తిడి తెచ్చే సంయుక్త కిసాన్ మోర్చా - రైతు సంఘాల సమిష్టి నిర్ణయంగా దేశవ్యాప్తంగా రైలు దిగ్బంధనాన్ని ప్రకటించింది. గత నవంబర్ నెల నుండి ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు తమ ఆందోళన ఉధృతం చేయడంలో భాగంగా రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు, దేశవ్యాప్తంగా నిరసనను చేపట్టడం తమ కొత్త వ్యూహంలో భాగమని చెప్పారు. ప్రభుత్వంతో పలు దఫాలు చర్చలు జరిపినప్పటికీ వ్యవసాయ చట్టాలపై ప్రతిష్టంభన కొనసాగడంతో నిరసనను మరింత ఉధృతం చేస్తున్నారు రైతులు .