రుణమాఫీ డబ్బులు రావడంతో రైతులు సంబురాలు

ఆమనగల్లు, వెలుగు: సాంకేతిక కారణంతో పెండింగ్​లో పడిన రుణమాఫీ డబ్బులు గురువారం బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రుణమాఫీ కావడంతో కడ్తాల్ లో రైతులు సంబురాలు చేసుకున్నారు. సాంకేతిక కారణాలతో హోల్డ్ లో పడడం, ఇతర కారణాలతో రుణమాఫీ కాని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో ఆనందం వ్యక్తం చేశారు. కెనరా బ్యాంక్  మేనేజర్, సిబ్బందికి వారు స్వీట్లు తినిపించి సంతోషం వ్యక్తం చేశారు. రైతులు దశరథం, జంగయ్య, గణేశ్, కాంగ్రెస్  నాయకులు బోసు రవి, శ్రీకాంత్, భానుకిరణ్  పాల్గొన్నారు.