
చిగురుమామిడి/తిమ్మాపూర్, వెలుగు: అవసరం మేరకు యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. యూరియా కొరత ఉందనే ప్రచారంతో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద శుక్రవారం యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామ రైతులు యూరియా దొరకడం లేదంటూ ఆందోళనకు దిగారు. గ్రామంలోని పీఏసీఎస్‌కు యూరియా లోడ్ వచ్చిందని తెలుసుకున్న రైతులు ఉదయం నుంచే క్యూ కట్టారు. కొంత సేపటికే బస్తాలు అయిపోవడంతో, యూరియా దొరకని రైతులు ఆందోళనకు దిగారు. రైతులందరికీ యూరియా అందజేస్తామని సంబంధిత అధికారులు హామీ ఇచ్చారు.