రైతులకు సదుపాయాలు కల్పించాలి : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ, వెలుగు : పశువుల సంతకు వస్తున్న రైతులకు, వ్యాపారులకు తగిన సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం మిర్యాలగూడ మండలం అవంతీపురం వ్యవసాయ మార్కెట్ ఆవరణలో జరిగే పశువుల సంత నిర్వహణ తీరును ఆయన పరిశీలించారు. అనంతరం రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పశువుల సంతకు తెలంగాణతోపాటు ఏపీ సరిహద్దు ప్రాంతాల నుంచి వ్యాపారులు, రైతులు క్రయవిక్రయాలకు వస్తున్నారని, వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అనంతరం మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురం మసీద్ అర్ఫాత్ లో ముస్లిం మైనార్టీ పెద్దలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధిలో మైనార్టీ వర్గాలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.