
ఏటూరునాగారం, వెలుగు: ధరణి పోర్టల్ వల్ల భూసమస్యలతో రైతులు దివాళా తీస్తున్నారని, రైతులు వర్గపోరాటాలకు రెడీ కావాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం రెండు ప్రెస్నోట్లు రిలీజ్ చేసింది. ధరణి పోర్టల్ గ్రామీణ భూస్వామ్య వర్గానికి వరంగా మారిందన్నారు. దొరల గడీలు కొత్త రంగులు దిద్దుకునేలా ధరణి పోర్టల్ ఏర్పడిందని ఆరోపించారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం మరొక ఉద్యమాన్ని నిర్మించాల్సిన కర్తవ్యం యువత ముందు ఉందని పేర్కొన్నారు. బీజేపీ నుంచి దేశాన్ని, ప్రజలను కాపాడాలని, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజంను ప్రతిఘటించాలని, బీఆర్ఎస్ కుటుంబపాలన, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని సూచించింది.