- డీసీసీబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి
మునుగోడు, వెలుగు: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులు తొందరపడి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోదని డీసీసీబీ ఉమ్మడి నల్లగొండ జిల్లా చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మునుగోడు, గూడపూర్, పులిపలుపుల, ఉకొండి, కచిలాపురం గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరక్టర్లు మేకల మల్లయ్య, సింగం వెంకన్న, జిట్టగోని యాదయ్య, మాదరగోని యాదయ్య, నన్నూరి శేఖర్ రెడ్డి, ఏఈవోలు నర్సింహ్మ, మౌనిక, సీఈవో సుఖేందర్, కాంగ్రెస్ పాల్గొన్నారు.